రాజస్థాన్‌లో కుప్పకూలిన యుద్ధ విమానం

రాజస్థాన్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. భారత వాయుసేనకు చెందిన ఫైటర్‌ జెట్‌ విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదం బుధవారం ఉదయం చురు జిల్లాలోని రతన్‌గఢ్ సమీపంలో జరిగింది. విమానం కూలిన సమయంలో దాన్ని నడిపించిన పైలట్‌ అక్కడికక్కడే మృతి చెందాడు.
విమానాన్ని ఎందుకు కోల్పోయామన్నది తెలియాల్సి ఉండగా, ప్రాథమిక సమాచారం మేరకు తక్షణమే సహాయక బృందాలు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ఈ ప్రమాదంపై భారత వాయుసేన స్పందించింది. విచారణకు ఆదేశించినట్లు ప్రకటించింది.

విమానం కూలిన ప్రాంతం చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీ శబ్దం వినిపించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రమాదానికి గల కారణాలపై పూర్తి వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

Read More : గుజరాత్‌లో వంతెన కూలిన దుర్ఘటన

One thought on “రాజస్థాన్‌లో కుప్పకూలిన యుద్ధ విమానం

Comments are closed.