బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ తనపై వస్తున్న వార్తలకు స్పష్టతనిచ్చారు. ‘‘నేను అమిత్ షా ఫోన్ చేసి మాట్లాడేంత పెద్ద నాయకుడు కాదు. అమిత్ షా ఎప్పుడూ నాకు ఫోన్ చేయలేదు, చేయరుకూడా. నేను ఒక నియోజకవర్గానికి మాత్రమే ఎమ్మెల్యేను’’ అని ఆయన అన్నారు. తెలంగాణ బీజేపీలో అనేక తప్పులు జరుగుతున్నాయని ఆరోపిస్తూ, వాటిని సరిచేయాలని పార్టీ అధిష్టానానికి పలు లేఖలు రాసినా, మెయిల్‌లు పంపినా ఎలాంటి స్పందన రాలేదని వెల్లడించారు. పార్టీ బలోపేతానికి తాను చేసిన సూచనలు పట్టించుకోవడం లేదని రాజా సింగ్ వ్యాఖ్యానించారు.
అధికారంలోకి రావాలంటే అట్టడుగు స్థాయి సమస్యలను పరిష్కరించాలని, కార్మికుల సమస్యలను వినాలని ఆయన సూచించారు. పార్టీ పట్ల నిబద్ధతతోనే తన అభిప్రాయాలను తెలియజేస్తున్నానని, వాటిని తప్పుగా అర్థం చేసుకోవద్దని రాజా సింగ్ స్పష్టం చేశారు.
Read More : ఇంటింటికీ మద్యం – కాంగ్రెస్‌పై కేటీఆర్ తీవ్ర విమర్శలు
One thought on “నేను పెద్ద నాయకుడిని కాదు: రాజా సింగ్ వ్యాఖ్యలు”
Comments are closed.