మెదక్‌లో బర్త్‌డే వేడుక విషాదం

మెదక్ జిల్లాలో బర్త్‌డే వేడుక విషాదంగా మారింది. స్నేహితుడి పుట్టినరోజు వేడుకకు వెళ్లిన నలుగురు యువకులు ప్రమాదానికి గురయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. మెదక్ జిల్లాకు చెందిన నలుగురు యువకులు ఒక ఎర్టిగా కారును రెంట్‌కు తీసుకుని స్నేహితుడి బర్త్‌డే పార్టీలో పాల్గొన్నారు. పార్టీలో మద్యం సేవించిన అనంతరం తిరుగు ప్రయాణంలో అతివేగంగా వెళ్తుండగా కారు అదుపు తప్పి కరెంట్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఢీకొట్టిన ధాటికి స్తంభం విరిగిపోగా, కారు బోల్తాపడింది.

ఈ ఘటనలో జశ్వంత్‌(18) అక్కడికక్కడే మృతిచెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంలో పాల్గొన్న యువకులు అందరూ 20 సంవత్సరాల లోపు వారేనని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Read More : నేను పెద్ద నాయకుడిని కాదు: రాజా సింగ్ వ్యాఖ్యలు

One thought on “మెదక్‌లో బర్త్‌డే వేడుక విషాదం

Comments are closed.