కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఓటర్ అధికార్ యాత్ర ముగింపు సందర్భంగా జరిగిన సభలో మాట్లాడుతూ, బీజేపీని ఉద్దేశించి ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. “నేను త్వరలో ఒక హైడ్రోజన్ బాంబు పెలుస్తాను. దానికి బీజేపీ సిద్ధంగా ఉండాలి” అంటూ ఆయన హెచ్చరించారు.
రాజకీయ వర్గాల్లో చర్చ:
రాహుల్ గాంధీ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. ఆయన ఈ “హైడ్రోజన్ బాంబ్” వ్యాఖ్యను ఏ ఉద్దేశంతో చేశారన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఏ అంశంపై ఆయన బీజేపీని ఇరుకున పెట్టబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. దీనిపై బీజేపీ కూడా ఘాటుగా స్పందించే అవకాశం ఉంది. రాహుల్ గాంధీ వ్యాఖ్యలు తదుపరి రాజకీయ పరిణామాలకు వేదిక కానున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఓటర్ అధికార్ యాత్ర
ప్రజా సమస్యలపై పోరాడుతూ, ప్రజల హక్కుల కోసం కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ‘ఓటర్ అధికార్ యాత్ర’ ఇటీవల ముగిసింది. ఈ యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ దేశంలోని పలు ప్రాంతాలను సందర్శించి ప్రజలతో మాట్లాడారు. ఈ యాత్ర తర్వాత ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
Read More : ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా స్పష్టమైన సందేశం.

One thought on “‘త్వరలో హైడ్రోజన్ బాంబ్ పెలుస్తా.. బీజేపీ సిద్ధంగా ఉండాలి’: రాహుల్ హెచ్చరిక”
Comments are closed.