దేశవ్యాప్తంగా పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ మిశ్రమంపై దాఖలైన పిల్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీంతో 2025-26 నాటికి దేశంలో E20 పెట్రోల్ వినియోగానికి ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి. ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్, జస్టిస్ కె. వినోద్ చంద్రన్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ జరిపింది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది షాదాన్ ఫరాసత్ వాదనలు వినిపిస్తూ, 2023కి ముందు తయారైన పాత వాహనాల్లో E20 వాడకం వల్ల మైలేజీ 6 శాతం వరకు తగ్గుతుందని నీతి ఆయోగ్ నివేదికలో ప్రస్తావించిన విషయాన్ని కోర్టు దృష్టికి తెచ్చారు. పాత వాహనాల కోసం కనీసం E10 పెట్రోల్ అందుబాటులో ఉండాలని కోరారు.
అయితే, కేంద్రం తరఫున అటార్నీ జనరల్ ఆర్. వెంకటరమణి ఈ వాదనలను వ్యతిరేకించారు. ఈ పిటిషన్ వెనుక ఒక పెద్ద లాబీ ప్రయోజనాలు ఉన్నాయని ఆరోపిస్తూ, ఇథనాల్ మిశ్రమం వల్ల చెరకు రైతులకు ఆర్థిక లాభం, ముడి చమురు దిగుమతుల తగ్గింపు, విదేశీ మారక ద్రవ్యం ఆదా జరుగుతుందని వివరించారు. “భారత్ ఎలాంటి ఇంధనాన్ని వాడాలో విదేశీ లాబీలు నిర్ణయిస్తాయా?” అని ఆయన ప్రశ్నించారు.
ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత, సుప్రీంకోర్టు పిటిషన్‌ను కొట్టివేస్తూ కేంద్ర ప్రభుత్వ విధానానికి మద్దతు తెలిపింది.
ఇదిలా ఉండగా, E20 వాడకం వల్ల వాహనాల యాక్సిలరేషన్, రైడ్ నాణ్యత మెరుగుపడటంతో పాటు కాలుష్యం తగ్గుతుందని కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఇప్పటికే స్పష్టం చేసింది. పెట్రోల్‌తో పోలిస్తే, ఇథనాల్ వినియోగం గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలను 65 శాతం వరకు తగ్గిస్తుందని ప్రభుత్వ అధ్యయనాలు చెబుతున్నాయి.
Read More : ‘త్వరలో హైడ్రోజన్ బాంబ్ పెలుస్తా.. బీజేపీ సిద్ధంగా ఉండాలి’: రాహుల్ హెచ్చరిక

One thought on “దేశవ్యాప్తంగా E20 పెట్రోల్ వాడకానికి గ్రీన్ సిగ్నల్.”
Comments are closed.