కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీకి కర్ణాటక చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈవో) నోటీసులు జారీ చేశారు. భారత ఎన్నికల వ్యవస్థలో లోపాలు ఉన్నాయని, ఓట్ల చోరీ జరుగుతోందని రాహుల్ ఇటీవల తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో, కర్ణాటకలో ఒక మహిళా ఓటరు రెండుసార్లు ఓటేశారని ఆయన చేసిన ఆరోపణలపై సీఈవో స్పందించారు. సీఈవో నోటీసులో, ఈ ఆరోపణలకు సంబంధించిన పూర్తి వివరాలు, ఆధార పత్రాలు సమర్పించాలని రాహుల్‌ను కోరారు. అలాగే, ఎన్నికల సంఘం కూడా రాహుల్‌ను ఉద్దేశిస్తూ – ఓట్ల చోరీ ఆరోపణలపై స్పష్టమైన డిక్లరేషన్ ఇవ్వాలని లేదా తప్పుడు ఆరోపణలు చేసినట్లయితే దేశానికి క్షమాపణ చెప్పాలని సూచించింది.
ఇటీవల రాహుల్ గాంధీ తన ప్రజెంటేషన్‌లో ఎన్నికల కమిషన్ రికార్డుల నుంచి సేకరించిన పత్రాలు చూపిస్తూ, పోలింగ్ అధికారి ఇచ్చిన రికార్డుల ప్రకారం శుకున్ రాణి అనే మహిళ రెండుసార్లు ఓటు వేశారని పేర్కొన్నారు. అయితే, విచారణలో శుకున్ రాణి ఒక్కసారే ఓటు వేశానని తేలిందని సీఈవో స్పష్టం చేశారు. ప్రజెంటేషన్‌లో చూపిన టిక్ మార్క్ పత్రాలు పోలింగ్ అధికారి జారీ చేసినవికావని కూడా వెల్లడించారు. కాబట్టి, ఈ ఆరోపణలపై సమగ్ర విచారణ జరపడానికి అవసరమైన పత్రాలు అందించాలని రాహుల్ గాంధీకి సీఈవో నోటీసులో పేర్కొన్నారు.
Read More : పాల్ఘర్‌లో ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకున్న అంబులెన్స్…

One thought on “రాహుల్ గాంధీకి కర్ణాటక సీఈవో నోటీసులు”
Comments are closed.