కన్నడ బుల్లితెర హాస్యనటుడు, ‘కామెడీ ఖిలాడీగాలు’ ఫేమ్ చంద్రశేఖర్ సిద్ధి (28) మృతి కేసులో కొత్త వివరాలు బయటపడ్డాయి. యల్లాపుర తాలూకా వజ్రళ్లి గ్రామ పంచాయతీ పరిధిలోని చిమనళ్లికి చెందిన సిద్ధి, జూలై 31న కట్టిగ గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ సమయంలో, అతను కొంతకాలంగా మానసిక ఒత్తిడితో ఉన్నాడని పోలీసులు పేర్కొన్నారు. 2020లో ‘కామెడీ ఖిలాడీగాలు’ సీజన్ 3లో తన హాస్యంతో, టైమింగ్తో ప్రేక్షకులను ఆకట్టుకున్న చంద్రశేఖర్ సిద్ధి, తరువాత పలు టీవీ సీరియళ్లలో నటించాడు. అయితే, ఆర్థిక సమస్యలు పెరగడంతో తీవ్ర ఆందోళనకు గురై, ఇల్లు గడవడానికి ఇటీవల దినసరి కూలీగా పనిచేశాడని కుటుంబ సభ్యులు తెలిపారు.
ప్రతిష్ఠాత్మక నిసామ్ థియేటర్ ఇన్స్టిట్యూట్లో నటనలో శిక్షణ పొందిన సిద్ధి, గత మూడు నెలలుగా మానసిక సమస్యలతో బాధపడుతున్నాడని అప్పట్లో అనుకున్నారు. కానీ తాజాగా వెలుగులోకి వచ్చిన విషయాలు వేరే కోణాన్ని చూపిస్తున్నాయి.
యల్లాపుర రూరల్ పోలీసులు వెల్లడించిన ప్రకారం, ఆత్మహత్యకు ముందు రోజు భార్యతో ఘర్షణ చోటుచేసుకుంది. ఆ సమయంలో భార్య చీపురు, కట్టెతో కొట్టడంతో ఆవేదనకు గురైన సిద్ధి, ఈ సంఘటన తర్వాతే ప్రాణాలను తీసుకున్నాడని దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు.
Read More : రాహుల్ గాంధీకి కర్ణాటక సీఈవో నోటీసులు

One thought on “కామెడీ ఖిలాడీగాలు ఫేమ్ చంద్రశేఖర్ సిద్ధి మృతి…”
Comments are closed.