ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం ‘పుష్ప 2: ది రూల్’ ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్లు సాధించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ. 1870 కోట్లకు పైగా వసూలు చేసి, అత్యధిక గ్రాస్ వసూలు చేసిన సినిమాగా నిలిచింది. అయితే, ఈ సినిమా రాబట్టిన లాభాలను జానపద కళాకారుల పింఛన్ల కోసం వినియోగించాలని తెలంగాణ హైకోర్టులో పిల్ దాఖలైంది.
న్యాయవాది నరసింహారావు తన ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో పుష్ప 2 సినిమాకు సంబంధించిన బెనిఫిట్ షోలు, టికెట్ ధరల పెంపు కారణంగా వచ్చిన లాభాలను చిన్న చిత్రాల బడ్జెట్ రాయితీకి, కళాకారుల సంక్షేమానికి కేటాయించాలన్నారు. కోర్టు ఈ విషయంపై విచారణ కొనసాగిస్తూ, సుప్రీం కోర్టు తీర్పును సమర్పించాలని ఆదేశించింది.
ఈ అంశంపై విచారణను రెండు వారాల తర్వాత మరల వాయిదా వేసింది. ‘పుష్ప 2’ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ నిర్మించారు.

One thought on “‘పుష్ప 2: ది రూల్’ సినిమాకి వచ్చిన లాభాలను కళాకారుల సంక్షేమానికి కేటాయించాలని పిల్ దాఖలైంది.”
Comments are closed.