పూరీని విమర్శించిన నెటిజన్‌పై యాక్టర్ కౌంటర్

Puri Jagannadh Vijay Sethupathi Movie

డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, హిట్, ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ బేస్‌ను ఏర్పరచుకున్నారు. “ఇస్మార్ట్ శంకర్”తో భారీ విజయాన్ని అందుకున్న పూరీ, ఆ తర్వాత విజయ్ దేవరకొండతో “లైగర్” అనే పాన్ ఇండియా సినిమా చేసినప్పటికీ, అది తీవ్రంగా విఫలమైంది. అనంతరం “డబుల్ ఇస్మార్ట్” సీక్వెల్ కూడా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ఈ పరిస్థితుల్లో, తన తదుపరి చిత్రానికి విజయ్ సేతుపతితో పనిచేస్తున్నట్టు పూరీ షాకింగ్ అనౌన్స్‌మెంట్ ఇచ్చారు.

ఈ వార్తపై కొంత మంది నెటిజన్లు వ్యతిరేకంగా స్పందిస్తూ, పూరీ అవుట్ డేటెడ్ అయ్యాడని, సేతుపతి ఎలా ఒప్పుకున్నాడని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలపై నటుడు శాంతను భాగ్యరాజ్ ఫైర్ అవుతూ, పరిశ్రమకు సంబంధించిన వ్యక్తులపై బాధ్యత లేకుండా వ్యాఖ్యలు చేయవద్దని, పూరీ వంటి దర్శకుడిని గౌరవించాలని సూచించారు. దీంతో విమర్శించిన నెటిజన్ పూరీని క్షమాపణలు చెప్పి తన సోషల్ మీడియా పోస్టును డిలీట్ చేసుకున్నాడు.

ఇదిలా ఉంటే, పూరీ జగన్నాథ్ – విజయ్ సేతుపతి కాంబినేషన్‌లో రూపొందనున్న కొత్త సినిమా జూన్‌లో సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ చిత్రానికి “బెగ్గర్” అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్టు సమాచారం. పూరీ మళ్లీ ట్రాక్‌లోకి వస్తాడా లేదా అనే విషయంపై అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Read More

One thought on “పూరీని విమర్శించిన నెటిజన్‌పై యాక్టర్ కౌంటర్

Comments are closed.