ధనాధన్ ఫార్మాట్‌లో స్కోరు 200 దాటినా గెలుపు కష్టమేనని అందరూ అనుకుంటున్న తరుణంలో మంగళవారం జరిగిన పంజాబ్ vs కోల్‌కతా మ్యాచ్ ఓ అపూర్వ రీతిలో అభిమానులకు థ్రిల్ ఇచ్చింది. గత మ్యాచ్‌లో 245 పరుగులు చేసి ఓడిన పంజాబ్ కింగ్స్ ఈ సారి కేవలం 111 పరుగులు మాత్రమే చేసినా దానిని కాపాడుకోవడంలో అద్భుతంగా విజయాన్ని అందుకుంది.
ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ 15.3 ఓవర్లలో 111 పరుగులకే కుప్పకూలింది. ప్రభ్‌సిమ్రన్ (30), ప్రియాన్ష్ ఆర్య (22), శశాంక్ సింగ్ (18) మాత్రమే కొంత నిలదొక్కుకున్నారు.
అనంతరం 112 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా ఆరంభం నుంచే ఒత్తిడిలోకి జారింది. తొలి రెండు ఓవర్లలో నరైన్ (5), డికాక్ (2)ను కోల్పోయింది. రఘువంశీ (37), రహానె (17) కలిసి నిలకడ చూపించినా, స్పిన్నర్ యుజువేంద్ర చాహల్ మ్యాజిక్‌తో మ్యాచ్‌ను పూర్తిగా మలుపు తిప్పాడు.
చాహల్ 4 ఓవర్లలో 28 పరుగులిచ్చి నాలుగు కీలక వికెట్లు పడగొట్టి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును గెలుచుకున్నాడు. మరోవైపు జాన్సెన్ మూడు వికెట్లు తీయగా, అర్ష్‌దీప్ విజయం దిశగా కీలక మెయిడిన్ ఓవర్ వేసాడు.
చివర్లో రస్సెల్ (17) భారీ షాట్లతో మ్యాచ్‌ను కాస్త ఉత్కంఠగా మార్చినా… 15వ ఓవర్లో అతడిని జాన్సెన్ బౌల్డ్ చేయడంతో పంజాబ్ అపూర్వ విజయం ఖరారైంది. ఈ విజయం పంజాబ్‌కు బలమైన మораల్ బూస్ట్ ఇచ్చిందనే చెప్పాలి.
నేటి మ్యాచ్:
ఢిల్లీ vs రాజస్థాన్
వేదిక: ఢిల్లీ
సమయం: రాత్రి 7.30 నుంచి.
Read More : వినేశ్ ఫొగట్ — కోట్ల ఆఫర్లను తిరస్కరించిన స్పష్టత!
