విమాన ప్రమాదానికి FADEC సిస్టమ్ వైఫల్యమే కారణం?

అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా ఘోర విమాన ప్రమాదానికి సంబంధించి ప్రాథమిక కారణాలు వెలుగులోకి వస్తున్నాయి. నిపుణుల అంచనా ప్రకారం, ఈ ప్రమాదానికి FADEC (ఫుల్ అథారిటీ డిజిటల్ ఇంజిన్ కంట్రోల్) సిస్టమ్ వైఫల్యం ప్రధాన కారణంగా భావిస్తున్నారు.

FADEC సిస్టమ్ లోపం వల్ల ఫ్యూయల్ ఫిల్టర్ జామ్ అయి, ఇంజిన్‌కు ఇంధనం సరఫరా నిలిచిపోయినట్లు తెలుస్తోంది. దీంతో ఇంజిన్ పూర్తిగా ఆగిపోయి, విమానం అదుపు తప్పి కూలిపోయినట్లు నిపుణులు ప్రాథమికంగా విశ్లేషిస్తున్నారు. అయితే, ఈ విషయానికి సంబంధించి పూర్తిస్థాయి స్పష్టత బ్లాక్ బాక్స్ డేటా విశ్లేషణతో పాటు ఇతర సాంకేతిక పరిశీలనల అనంతరం వెల్లడి కానుంది.

FADEC సిస్టమ్ అనేది విమాన ఇంజిన్ పనితీరును డిజిటల్‌గా నియంత్రించే అత్యంత ప్రాధాన్యత గల వ్యవస్థ. ఇది ఇంధన ప్రవాహం, ఇంజిన్ శక్తి ఉత్పత్తి, ఇతర ప్యారామీటర్లను సమన్వయపరచి విమానం సురక్షితంగా ప్రయాణించేందుకు సహాయపడుతుంది. పైలట్ దీనిని ఓవరైడ్ చేయలేరు. అందుకే ఈ వ్యవస్థలో సమస్య తలెత్తితే విమానాన్ని నియంత్రించడం సాధ్యపడదు.

ప్రస్తుతం బ్లాక్ బాక్స్ విశ్లేషణ, మిగతా సాంకేతిక పరిశోధనలు కొనసాగుతున్నాయి. పూర్తి నివేదిక వెలువడిన తర్వాత ఈ ప్రమాదానికి గల అసలు కారణాలు వెల్లడికానున్నాయి.

Read More : ఆర్మీ హెలికాప్టర్‌కు తప్పిన ప్రమాదం

One thought on “విమాన ప్రమాదానికి FADEC సిస్టమ్ వైఫల్యమే కారణం?

Comments are closed.