గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా మళ్లీ భారత్‌కి తిరిగొస్తున్నారా? కాపురాన్ని న్యూయార్క్ నుంచి ముంబైకి షిఫ్ట్ చేస్తున్నారా? అనే చర్చ ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రియాంక హాలీవుడ్‌లో ఒక దశలో బిజీగా ఉన్నా, 2021 తరువాత ఆమెకు అవకాశాలు తగ్గిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె ‘హెడ్స్ ఆఫ్ స్టేట్’, ‘ది బ్లప్’ అనే రెండు హాలీవుడ్ సినిమాల్లో నటిస్తున్నా, గత కొంతకాలంగా రెండు మూడు సార్లు భారతదేశానికి వచ్చినట్లు సమాచారం.
ఇందులోనే ఆసక్తికరంగా మారిన అంశం, ఆమె రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కనున్న ఎస్ ఎస్ ఎంబీ 29 చిత్రానికి సైన్ చేయడం. దీంతో ఈ ప్రాజెక్ట్‌కి గ్లోబల్ లెవెల్‌లో క్రేజ్ పెరిగింది. అంతేకాదు, తాజాగా మరో రెండు హిందీ చిత్రాలకు కూడా పీసీ సైన్ చేసిందని తెలుస్తోంది. మ్యాడ్ డాక్ ఫిల్మ్స్ నిర్మాణంలో ఓ లేడీ ఓరియెంటెడ్ ప్రాజెక్ట్‌తో పాటు క్రిష్4 లోనూ ఆమె కథానాయికగా ఎంపిక కావడం గమనార్హం. ఈ రెండు ప్రాజెక్టులు ఆమె బాలీవుడ్‌లోకి పునరాగమనం చేస్తున్న సూచనలుగా ఫిల్మ్ వర్గాల్లో చర్చకు దారితీస్తున్నాయి.
ఇప్పటికే బాలీవుడ్ నిర్మాతల నుంచి పీసీకి ఎన్నో ఆఫర్లు వచ్చినా, గతంలో వాటిని వినయంగా తిరస్కరించేది. కానీ ఇప్పుడు వచ్చిన అవకాశాలను స్వీకరించడం, ఇటీవల ముంబైలో ఎక్కువగా కనిపించడం, దేశీయ చిత్రాలపై ఫోకస్ పెంచడంలో జరిగే పరిణామాలు ఆమె ఇండియాకి తిరిగొస్తున్న సూచనలుగా భావిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ముంబైలోనే ఉన్నట్లు సమాచారం. దీంతో ప్రియాంక భవిష్యత్‌ను ఇండియన్ సినిమాల్లోనే కొనసాగించనున్నారా? అనే ప్రశ్నకు ఉత్కంఠ భరితమైన వేచి చూపు నెలకొంది.

One thought on “బాలీవుడ్ లోకి ప్రియాంక చోప్రా రీ-ఎంట్రీ… ఇండియాలోనే ఉండబోతోందా?”
Comments are closed.