హనుమాన్ జయంతి సందర్భంగా తాడ్‌బండ్ హనుమంతుడిని దర్శించిన ప్రీతి జింటా

హనుమాన్ జయంతిని పురస్కరించుకుని సికింద్రాబాద్ తాడ్‌బండ్ హనుమాన్ దేవాలయం భక్తులతో కిటకిటలాడుతోంది. వీరహనుమాన్ జయంతి సందర్భంగా గౌలిగూడ నుంచి తాడ్‌బండ్ వరకూ ఘనంగా శోభాయాత్ర సాగుతోంది.

ఈ వేడుకల సందర్భంలో పంజాబ్ కింగ్స్ కో-ఓనర్, బాలీవుడ్ నటి ప్రీతి జింటా ప్రత్యేక ఆకర్షణగా మారారు. శనివారం ఉదయం తాడ్‌బండ్ హనుమాన్ ఆలయానికి వచ్చిన ప్రీతి జింటా స్వామివారి దర్శనం తీసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈరోజు సాయంత్రం ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనున్న తమ జట్టు విజయాన్ని కోరుతూ, ఆంజనేయుడి ఆశీస్సులు తీసుకున్నట్టు సమాచారం. ఐపీఎల్ ట్రోఫీపై కన్నేసిన పంజాబ్ కింగ్స్‌కు ఈ సీజన్ అత్యంత కీలకం కావడంతో, ఈసారైనా హనుమంతుడి కృపతో విజయం తమవైపుకే చేరుతుందని ప్రీతి ఆశాభావం వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు.

ఇక ఈరోజు జరిగే మ్యాచ్‌ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తప్పకుండా గెలిచి తమ ప్లేఆఫ్ ఆశలను నిలబెట్టుకోవాలని పట్టుదలగా ఉందని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు పంజాబ్ కింగ్స్‌ కూడా గత మ్యాచ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌ను ఓడించిన ఆత్మవిశ్వాసంతో ఈ మ్యాచ్‌ను గెలవాలని చూస్తోంది.

హనుమాన్ జయంతి వేడుకల నేపథ్యంలో ప్రీతి జింటా ఆలయ సందర్శన స్థానికంగా విశేష చర్చనీయాంశంగా మారింది.

Read More : “వీరమల్లు” రిలీజ్ మే 9కి ఖాయం, “మాస్ జాతర” మరియు “సింగిల్” వాయిదా!

One thought on “హనుమాన్ జయంతి సందర్భంగా తాడ్‌బండ్ హనుమంతుడిని దర్శించిన ప్రీతి జింటా

Comments are closed.