బాలీవుడ్ నటి, ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ జట్టు సహ యజమాని అయిన ప్రీతి జింటా తనపై సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న ఫేక్ ఫొటోపై స్పందించారు. యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీని తాను కౌగిలించుకున్నట్లు చూపించే ఫొటో పూర్తిగా మార్ఫింగ్ చేశారని, నిజానికి దాని వెనుక ఎలాంటి వాస్తవం లేదని ఆమె ఖండించారు.
ఈ నెల 18న రాజస్థాన్ రాయల్స్ మరియు పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ ముగిశాక సోషల్ మీడియాలో ఓ ఫొటో వైరల్ అయింది. ఆ ఫొటోలో ప్రీతి జింటా యువ క్రికెటర్‌ను ఆలింగనం చేసుకుంటున్నట్లు కనిపించింది. కొద్దిసేపట్లోనే ఆ చిత్రం తెగ వైరల్ అయి, ఓ గుజరాతీ వెబ్‌సైట్ దానిపై కథనాన్ని కూడా ప్రచురించింది.
ఈ నేపథ్యంలో ప్రీతి జింటా సోషల్ మీడియా వేదికగా స్పందించారు. “ఆ ఫొటో పూర్తిగా మార్ఫింగ్ చేసినది. నిజాలు తెలుసుకోకుండా అలాంటి అసత్య కథనాలను ప్రచురించడం నిజంగా షాకింగ్. ఇది నన్ను తీవ్రంగా బాధించింది,” అంటూ ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
ప్రీతి జింటా ఐపీఎల్ జట్టు సహ యజమాని అయినప్పటికీ, ప్రత్యర్థి జట్టు సభ్యుడితో ఈ రకంగా ప్రవర్తించారన్న ఆరోపణలు అనవసరమైనవని, అవి నకిలీ టెక్నాలజీ మాయమని స్పష్టమవుతోంది. ఈ ఘటన మరోసారి సోషల్ మీడియాలో వస్తున్న సమాచారం నిజమైనదా కాదా అన్న విషయంలో జాగ్రత్తగా పరిశీలించాల్సిన అవసరం ఎంతగానో ఉందని సూచిస్తోంది.
Read More : తన కొత్త సినిమా కోసం శ్రమిస్తున్న రాశీ ఖన్నా

One thought on “బాలీవుడ్ నటి ప్రీతి జింటా ఫేక్ ఫొటోపై ఘాటుగా స్పందన.”
Comments are closed.