టీడీపీ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు సంచలన వ్యాఖ్యలు.. మాజీ మంత్రి విడదల రజనీపై తీవ్ర విమర్శలు

మాజీ మంత్రి, వైసీపీ నేత విడదల రజనీ (Vidadala Rajini)పై టీడీపీ (TDP) చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు (Prathipati Pulla Rao) తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అవినీతి మంత్రిగా ముద్ర వేసుకున్న వ్యక్తి ఇప్పుడు నీతులు చెబితే ప్రజలు నమ్ముతారా? అని ప్రశ్నించారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన, అధికార గర్వంతో అనేక అక్రమాలు, దుర్మార్గాలు చేసిన వారు ఇప్పుడు సానుభూతి పొందే ప్రయత్నాలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు.

“అవినీతి చేసి నీతులు చెప్పాలా?”

ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ, “తప్పు చేయనప్పుడు ఉలికిపాటు ఎందుకు? తమ ప్రభుత్వ హయాంలో కేసులు పెట్టిన వారిని ఇప్పుడు తిరిగి డబ్బులిస్తామని ఎందుకు బతిమాలుకుంటున్నారు?” అని ప్రశ్నించారు. ఆయన ఆరోపణలు చేస్తూ, “చేసిన తప్పులు కడుక్కోవడానికి జీవిత కాలం సరిపోదు. సొంత పార్టీ నేతలే హైకోర్టును ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది” అని వ్యాఖ్యానించారు.

విషప్రచార సంస్కృతి వైసీపీదే

చిలకలూరిపేటలో అసభ్యపోస్టులు, విషప్రచార సంస్కృతి తీసుకొచ్చిన ఘనత వైసీపీదేనని ఆరోపించిన ఆయన, “రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని చెప్పడం సరికాదు. చట్టబద్ధమైన చర్యలు తప్పకుండా ఉంటాయి” అని స్పష్టం చేశారు. “విడదల రజనీ చేసిన తప్పులు ఎక్కడికి పోతాయి?” అంటూ ప్రత్తిపాటి పుల్లారావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

One thought on “టీడీపీ ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు సంచలన వ్యాఖ్యలు.. మాజీ మంత్రి విడదల రజనీపై తీవ్ర విమర్శలు

Comments are closed.