మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ ప్రమోషన్స్‌ను వేగంగా కొనసాగిస్తున్నారు. ఏప్రిల్‌లో విడుదల కానున్న ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా పాన్-ఇండియా స్టార్ ప్రభాస్ ఇందులో కీలక పాత్రలో కనిపించనుండటంతో సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది.
ఇప్పటి వరకు ప్రభాస్ గెస్ట్ రోల్‌లో కనిపిస్తారని వార్తలు వచ్చినా, మంచు విష్ణు తాజాగా ఇచ్చిన అప్‌డేట్ ప్రకారం ప్రభాస్ పాత్ర సినిమాలో చాలా సేపు ఉంటుంది.
ప్రభాస్ ‘రుద్ర’ అనే శక్తివంతమైన పాత్రలో కనిపించనున్నారు. ఆయన పాత్రకు 25-30 నిమిషాల స్క్రీన్ టైమ్ ఉండనుందని మంచు విష్ణు వెల్లడించారు. ఇది సినిమాకు స్పెషల్ హైలైట్ కానుందని అంటున్నారు.
ప్రభాస్ పాత్రకు గ్రాండ్ ఎంట్రీ ఇవ్వడానికి ఒక ప్రత్యేకమైన డివోషనల్ సాంగ్ ప్లాన్ చేశారు. ఈ పాటకు గణేష్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. ఇందులో ప్రభాస్ డివోషనల్ లుక్ లో కనిపించనున్నారు.
మోహన్ బాబు నిర్మాణంలో వస్తున్న ‘కన్నప్ప’ ఏప్రిల్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర ఎంతవరకు ప్రత్యేకంగా ఉంటుందో చూడాలి!

One thought on “‘కన్నప్ప’లో ప్రభాస్ పాత్రపై ఆసక్తికర అప్‌డేట్!”
Comments are closed.