సినీ నటుడు పోసాని కృష్ణమురళికి మరోసారి షాక్ తగిలింది. సులోరూ పేట పోలీస్ స్టేషన్లో ఆయనపై తాజా కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి విచారణకు హాజరు కావాలంటూ ఈ నెల 15న హాజరు కావాలని పోలీసులు పోసానికి నోటీసులు జారీ చేశారు.
కోర్టు ఆదేశాల మేరకు సీఐడీ కార్యాలయానికి హాజరైన సమయంలో ఆయన్ను పోలీసులు కలిసి ఈ నోటీసులు అందజేశారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే పోసానిపై 15కి పైగా కేసులు నమోదైన విషయం తెలిసిందే.
ఈ కేసుల నేపథ్యంలో ఆయన పలు కారాగారాల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. కాగా, గత నెలలో ఆయనకు కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన విషయం విధితమే.
Read More : ఏపీ విపత్తుల శాఖ హెచ్చరిక: మూడు గంటల్లో మూడు జిల్లాల్లో వర్షం..

One thought on “సినీ నటుడు పోసాని కృష్ణమురళిపై మరో కేసు నమోదు ..”
Comments are closed.