పోసాని కృష్ణమురళి బెయిల్‌పై విడుదల – కోర్టు విధించిన షరతులు

posanikrishnamurali

ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్టైన సినీ నటుడు పోసాని కృష్ణమురళి కొద్ది రోజుల పాటు జైలు జీవితం అనుభవించి, చివరకు బెయిల్‌పై విడుదల అయ్యారు. కోర్టు విధించిన షరతుల మేరకు, ఆయన గురువారం మంగళగిరిలోని సీఐడీ కార్యాలయానికి హాజరై సంతకం చేశారు.

కోర్టు విధించిన కీలక షరతులు:

✅ దేశం విడిచి వెళ్లకూడదు.
✅ కేసు గురించి బహిరంగంగా మాట్లాడకూడదు. మీడియాకు ప్రకటనలు చేయరాదు.
నాలుగు వారాల పాటు ప్రతి మంగళ, గురు వారాల్లో మంగళగిరిలోని సీఐడీ కార్యాలయంలో సంతకం చేయాలి.
✅ కేసు దర్యాప్తుకు పూర్తిగా సహకరించాలి.

కోర్టు ఆదేశాలను పాటిస్తూ పోసాని సీఐడీ కార్యాలయంలో హాజరై సంతకం చేశారు. కేసు విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో కోర్టు నిర్ణయాలపై రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

Read More : మంగళగిరి అభివృద్ధిపై మంత్రి లోకేష్ కీలక ప్రకటన

One thought on “పోసాని కృష్ణమురళి బెయిల్‌పై విడుదల – కోర్టు విధించిన షరతులు

Comments are closed.