పూజా హెగ్డే కెరీర్ మళ్లీ పుంజుకుంటుందా?

Pooja Hegde career comeback

టాలీవుడ్‌లో ముకుంద సినిమాతో అడుగుపెట్టిన పూజా హెగ్డే, తొలి ప్రయత్నంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. తక్కువ సమయంలోనే టాప్ హీరోలతో నటిస్తూ అగ్ర కథానాయికగా ఎదిగింది. అయితే ఇటీవల ఆమె కెరీర్‌లో మలుపులు వచ్చాయి. వరుస సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ, టాలీవుడ్‌లో అవకాశాలు తగ్గిపోవడంతో కొంతకాలంగా తెలుగు తెరపై కనిపించలేదు. బాలీవుడ్‌లో అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నం చేసినా, ఆశించిన ఫలితాలు రాలేదు. దీంతో మళ్లీ దక్షిణాదిలో పాగా వేసేందుకు ప్రయత్నిస్తోంది.

ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ హీరో సూర్య సరసన రెట్రో సినిమాలో నటిస్తున్న పూజా, ఈ సినిమాతో బౌన్స్‌బ్యాక్ అవ్వాలని చూస్తోంది. అంతేకాదు, సూపర్ స్టార్ రజినీకాంత్, లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్‌లో రూపొందుతున్న కూలీ చిత్రంలో ప్రత్యేక గీతంలో నటిస్తోంది. అలాగే, రాఘవ లారెన్స్ దర్శకత్వంలో రాబోతున్న కాంచన 4లో కూడా ఆమె ఛాన్స్ దక్కించుకున్నట్లు సమాచారం. ఈ మూడు చిత్రాలు హిట్ అయితే, మళ్లీ సౌత్‌లో పూజా హెగ్డే బిజీ అవ్వడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

అవకాశాల కోసం ఎదురు చూస్తున్న పూజా, కెరీర్‌లో తిరిగి మెరుగైన అవకాశాలు రావాలని కొంత ఆధ్యాత్మిక మార్గాన్ని కూడా ఎంచుకుంది. ఈ రోజు తిరుపతిలోని శ్రీకాళహస్తి ఆలయానికి వెళ్లి రాహుకేతు పూజలో పాల్గొంది. కుటుంబసభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం దైవదర్శనం చేసుకుంది. ఆలయ అర్చకులు ఆమె కుటుంబానికి ఆశీర్వచనాలు అందించారు. ప్రస్తుతం ఈ పూజల ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి పూజా చేసిన పూజలు ఫలించి, ఆమె కెరీర్ మళ్లీ ఫుల్ స్వింగ్‌లోకి వస్తుందేమో చూడాలి.

Read More

One thought on “పూజా హెగ్డే కెరీర్ మళ్లీ పుంజుకుంటుందా?

Comments are closed.