ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మోదీ నివాళి

తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే నటుడు, నాయకుడు ఎన్టీఆర్ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులర్పించిన ప్రధాని, ఎన్టీఆర్ జీవితంలో ఎన్నో గొప్ప గుణాలు ఉన్నాయని, ఆయన నటించిన పాత్రలు ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయని తెలిపారు.

తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్ విశిష్టమైన స్థానం సంపాదించారని, ఆయన పేదలు, అణగారిన వర్గాల కోసం చేసిన సేవలు గుర్తించదగినవని మోదీ కొనియాడారు. ఎన్టీఆర్ ఒక గొప్ప దార్శనికుడని అభివర్ణించిన ప్రధాని, ఆయన ఆశయాలు నేటికీ ఎంతో మందికి ప్రేరణగా నిలుస్తున్నాయన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పడిన కూటమి ప్రభుత్వం ఎన్టీఆర్ ఆశయాల సాధన కోసం కృషి చేస్తోందని కూడా మోదీ పేర్కొన్నారు. ప్రజాసేవలో ఎన్టీఆర్ చూపిన మార్గదర్శకత్వం అందరికీ ఆదర్శంగా నిలుస్తుందన్నారు.

Read More : సీఎం పదవి పై నాకు తొందర లేదు: నారా లోకేష్