పెద్ది సినిమా ఆడియో రైట్స్ 37 కోట్ల భారీ రేటుకు టీ-సిరీస్‌కు

Peddhi movie audio rights

“గేమ్ ఛేంజర్” చిత్రంతో గ్లోబల్ స్టార్‌గా తన గుర్తింపు పెంచుకున్న రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం “పెద్ది”. ఉప్పెన సినిమాతో పాపులారిటీ పొందిన బుచ్చిబాబు సాన ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. చిత్రంపై మొదటి అనౌన్స్‌మెంట్ నుంచే భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

బుచ్చిబాబు, సుకుమార్ మాటలతో సినిమాపై మరింత హైప్ పెరిగింది. సుకుమార్ “రెండో సినిమా ఇదే! ఈ స్థాయిలో తెర‌కెక్కించడం చూస్తే నేను షాక్ అయ్యా” అని చెప్పాడు. బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్, క‌న్న‌డ స్టార్ శివ రాజ్ కుమార్ కీల‌క పాత్రలలో నటిస్తున్నారు.

మ్యూజిక్ డైరెక్టర్‌గా ఏ.ఆర్. రెహమాన్ సినిమాకు ప్రత్యేకమైన ట్యూన్స్‌ను ముందే సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. పెద్ది సినిమాలో పాటలు, స్కోర్ అన్ని టీ-సిరీస్ ద్వారా విడుదల అవ్వనున్నాయి. టీ-సిరీస్ ఈ ఆడియో రైట్స్ కొరకు 37 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు సమాచారం.

ఫిల్మ్ నగర్లో “పెద్ది” సినిమా గ్లింప్స్ వీడియోని ఏప్రిల్ 6న విడుదల చేయనున్నారు. గ్లింప్స్ ప్రేక్షకులకు నెక్స్ట్ లెవెల్ అనుభూతిని అందించేలా ఉండబోతోంది.

మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా, ఈ ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Read More

One thought on “పెద్ది సినిమా ఆడియో రైట్స్ 37 కోట్ల భారీ రేటుకు టీ-సిరీస్‌కు

Comments are closed.