ప్లేట్‌లో బొద్దింక.. అనిత క్లారిటీ

పాయకరావుపేట బీసీ బాలికల హాస్టల్‌ భోజన సమయంలో తన ప్లేట్‌లో బొద్దింక వచ్చిందన్న వార్తలు పూర్తిగా అసత్యమని, వాటిని తాను తీవ్రంగా ఖండిస్తున్నానని హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. ప్లేట్‌లో బొద్దింక కాదని, కేవలం చిన్న వెంట్రుక మాత్రమేనని ఆమె వివరించారు. తాను విద్యార్థులతో కలిసి భోజనం చేసిన సమయంలో ఈ సంఘటన జరిగినట్టు తెలిపారు. ఈ ఘటనను వక్రీకరించి తనపై దుష్ప్రచారం చేస్తున్నవారిపై మంత్రి తీవ్రంగా మండిపడ్డారు. “వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారిక సోషల్ మీడియా ఖాతాల నుంచి ఈ అసత్య ప్రచారం జరుగుతోంది. మంచిని కూడా చెడుగా చూపించేందుకు ఈ ప్రయత్నం సాగుతోంది,” అని ఆమె ఆరోపించారు. హాస్టల్ తనిఖీల సమయంలో తగిన మెనూ పాటించకపోవడం, వార్డెన్, సెక్యూరిటీ సిబ్బంది అందుబాటులో లేకపోవడం వంటి లోపాలను గుర్తించిన నేపథ్యంలో వార్డెన్‌ను సస్పెండ్ చేసినట్లు ఆమె తెలిపారు. రాష్ట్రంలోని అన్ని హాస్టళ్లను తనిఖీ చేయాలని అధికారులను ఆదేశించామన్నారు.

“గత ఐదేళ్లలో ఒక్క వైసీపీ ఎమ్మెల్యే అయినా హాస్టల్‌ను సందర్శించారా?” అంటూ ఆమె నిలదీశారు. ప్రజా సంక్షేమం కోసం తాము చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని, వైసీపీ నేతలకు మాత్రం అధికార దాహం తప్ప మానవత్వం లేదని మండిపడ్డారు.

READ MORE : వీఆర్ హైస్కూల్ ప్రారంభోత్సవంలో మంత్రి లోకేష్

One thought on “ప్లేట్‌లో బొద్దింక.. అనిత క్లారిటీ

Comments are closed.