పవన్ కళ్యాణ్ స్పష్టీకరణ

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హిందీ భాషపై తన స్పష్టమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇంట్లో మాట్లాడుకోవడానికి మాతృ భాష అయిన తెలుగు ఉన్నప్పటికీ, సరిహద్దులు దాటి దేశవ్యాప్తంగా మాట్లాడే భాషగా హిందీ ఉందని పేర్కొన్నారు. హిందీ నేర్చుకోవడంలో ఎలాంటి తప్పు లేదని, దాన్ని వ్యతిరేకించడం అవివేకమని తెలిపారు. “హిందీని మా మీద రుద్దుతున్నారు” అని చెప్పడం సరైన ధోరణి కాదని పవన్ వ్యాఖ్యానించారు. హిందీ భాషపై తనకున్న ఆదరాభిమానంతోనే “ఖుషీ” సినిమాలో హిందీ పాటను జోడించానని తెలిపారు. “నా మాతృభాష తెలుగు అయితే, దేశ రాజ్యభాష హిందీ అనే సందేశం ఇవ్వడానికే ‘యే మేరా జహా’ అనే పాటను జోడించాను,” అని పవన్ వివరించారు.

పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు భాషల పట్ల గౌరవాన్ని, సమగ్ర భారతదేశంలో సంభాషణలకు హిందీ పాత్రను హైలైట్ చేస్తూ వినిపించాయి.

Read More : నెల్లూరు జిల్లాలో టీడీపీ నేత ఆత్మహత్యాయత్నం…