యోగా ప్రాచుర్యంలో మోదీ ఘనతపై పవన్ కళ్యాణ్ ప్రశంసలు

11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖపట్నంలో నిర్వహించిన వేడుకల్లో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యోగా భారతీయులకు దక్కిన అమూల్య గౌరవమని అభివర్ణించారు. యోగాను ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోదీదేనని పవన్ ప్రశంసించారు.

తన ప్రసంగాన్ని సూర్య భగవానుడికి, యోగ విద్యకు ఆద్యుడు అయిన పరమశివునికి, యోగశాస్త్ర రూపకర్త పతంజలి మహర్షికి వందనలు తెలియజేస్తూ ప్రారంభించారు. భారతీయ సనాతన ధర్మం గొప్పతనాన్ని ప్రపంచానికి పరిచయం చేయడంలో ప్రధాని మోదీ పాత్ర అత్యంత కీలకమైందని చెప్పారు. ఒత్తిడిని జయించి దృఢ సంకల్పంతో ముందుకు సాగాల్సిన ఆదర్శాన్ని మోదీ చూపించారంటూ ఆయన ప్రశంసలు కురిపించారు.

2014లో ఐక్యరాజ్యసమితిలో ప్రధాని మోదీ యోగా దినోత్సవంపై ప్రవేశపెట్టిన తీర్మానికి 177 దేశాలు మద్దతు ఇవ్వడం గర్వకారణమని పవన్ గుర్తుచేశారు. 2015 నుండి అధికారికంగా యోగా దినోత్సవం జరుపుకుంటున్న నేపథ్యంలో, ఈ ఏడాది విశాఖ వేదికగా మారడం ఎంతో హర్షణీయమని అన్నారు. ఈ కార్యక్రమం ప్రపంచ రికార్డుగా నిలిచినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రధానమంత్రి మోదీకి కృతజ్ఞతలు తెలిపారు.

“వన్ ఎర్త్, వన్ హెల్త్” అనే థీమ్‌ను ప్రతి ఒక్కరూ అవలంబించాలని పవన్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఆయుష్ శాఖ సహాయ మంత్రి ప్రతాప్ రావ్ జాదవ్, ఇతర ప్రముఖులకు ధన్యవాదాలు తెలిపారు.

యోగా గొప్పతనాన్ని ఋగ్వేద కాలం నుంచే భారతీయ ఋషులు చాటిన విషయాన్ని గుర్తుచేస్తూ, ప్రపంచానికి దీన్ని తెలియజెప్పిన ప్రధాని మోదీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

read More : ఏపీలో పోలీసుల వేధింపులపై పెరుగుతున్న ఆరోపణలు

One thought on “యోగా ప్రాచుర్యంలో మోదీ ఘనతపై పవన్ కళ్యాణ్ ప్రశంసలు

Comments are closed.