సంగారెడ్డి జిల్లా పఠాన్ చెరు మండలం పాశ మైలారం పారిశ్రామికవాడలోని ఓ కెమికల్స్ ఫ్యాక్టరీలో ఇవాళ (సోమవారం) ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రియాక్టర్ పేలడంతో అగ్ని ప్రమాదం సంభవించగా, పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు ఎగిసి పడిపోయాయి. ఘటనకు సంబంధించిన వీడియోలు స్థానికుల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది తక్షణమే ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసే పనిలో నిమగ్నమయ్యారు. అయితే మంటలతో కూడిన ఘాటైన పొగలు భారీగా వ్యాపించడంతో, పరిశ్రమ పరిసరాల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. పలువురు కార్మికులు అస్వస్థతకు గురయ్యారు.
ఈ ప్రమాదంతో పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులు మరియు స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వారిని అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మంటల్లో చిక్కుకున్న కార్మికుల్లో కొందరికి తీవ్రగాయాలు కావడంతో వారిని చికిత్స కోసం సమీప ఆసుపత్రికి తరలించారు.
పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రస్తుతం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఘటనపై పూర్తి సమాచారం రావాల్సి ఉంది.
Read More : న్యూస్ యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో సంచలన మలుపు…

One thought on “పఠాన్ చెరు పారిశ్రామికవాడలో భారీ పేలుడు…”
Comments are closed.