పాకిస్తాన్ ప్రభుత్వం తమ దేశంలో అక్రమంగా ప్రవేశించిన 55 మంది అఫ్గాన్ పిల్లలను వెనక్కి పంపినట్లు అధికారికంగా ప్రకటించింది. కైబర్ జిల్లాలోని సరిహద్దు ప్రాంతంలో ఈ చిన్నారులు అక్రమంగా ప్రవేశించినట్టు అధికారులు గుర్తించారు. పాకిస్తాన్ ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం, ఈ పిల్లలు సరిహద్దు కంచెను కోసి దేశంలోకి ప్రవేశించినట్లు నిర్ధారణ అయ్యింది.
ఈ ఘటనపై పాక్ అధికారిక వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం, ఇటీవలి కాలంలో అఫ్గానిస్తాన్ నుండి పెద్ద సంఖ్యలో శరణార్థులు పాకిస్తాన్లోకి అక్రమంగా ప్రవేశిస్తున్నట్లు సమాచారం. సరిహద్దు భద్రతను మరింత కట్టుదిట్టం చేసినప్పటికీ, కొందరు అక్రమ మార్గాల్లో దేశంలోకి చొరబడుతున్నారని తెలిపారు.
అయితే, ఈ తరహా అక్రమ ప్రవేశాలను అడ్డుకోవడానికి పాక్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. మరోవైపు, రాజకీయ విశ్లేషకులు, సామాజిక కార్యకర్తలు ఇదే తరహా చర్యలను భారత్‌లోని బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా ప్రవేశించే వ్యక్తుల విషయంలో కూడా తీసుకోవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానిస్తున్నారు. భారత ప్రభుత్వం ఎప్పుడు ఈ విషయంలో నిర్ణయాత్మక చర్యలు తీసుకుంటుందో చూడాల్సి ఉంది.
Read More : యార్క్‌షైర్‌లో ప్రపంచంలోనే తొలిసారి గొర్రెలకు బర్డ్ ఫ్లూ కేసు నమోదు

One thought on “పాకిస్తాన్లో అక్రమంగా ప్రవేశించిన 55 అఫ్గాన్ పిల్లలను వెనక్కి పంపిన పాక్ ప్రభుత్వం”
Comments are closed.