పాక్ కుట్ర బహిరంగం

ఆపరేషన్ సిందూర్‌లో భారత సైన్యం జరిపిన మెరుపుదాడుల్లో తీవ్రంగా గాయపడిన జైషే మహ్మద్ ఉగ్రవాదులను పాకిస్థాన్ సీనియర్ ఆర్మీ అధికారి స్వయంగా ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు. ఈ ఘటనపై భారతదేశంలో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉగ్రవాదులపై పాకిస్థాన్ మద్దతు ఇంత వరకు వెళ్లిందా? అనే ప్రశ్నలు నెట్టింట వెల్లువెత్తుతున్నాయి.

పాకిస్థాన్ మరోసారి తన వక్రబుద్ధిని నిరూపించుకుందంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. “ఉగ్రవాదికు సహాయం చేయడం , ప్రభుత్వం ఎలా శాంతి కోరుతుంది?” అంటూ సోషల్ మీడియాలో విరుచుకుపడుతున్నారు. ఉగ్రవాదానికి ఆర్థిక సహాయం, వైద్యం వంటి మద్దతులు ఇస్తున్న పాకిస్థాన్ ఆ దేశ భద్రతపై ఎంత ప్రమాదకరంగా మారిందో ఈ ఉదంతం వెల్లడిస్తున్నదని విమర్శకులు పేర్కొంటున్నారు.

Read More : రక్షణ వ్యయం 18 శాతం పెంపునకు ఆమోదం