జమ్మూకశ్మీర్‌లోని పహెల్‌గామ్‌లో మంగళవారం జరిగిన ఉగ్రదాడిలో విశాఖపట్నం వాసి, రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి చంద్రమౌళి మృత్యువాత పడ్డారు. దాడి సమయంలో పారిపోతున్న చంద్రమౌళిని ఉగ్రవాదులు వెంబడించి దగ్గర నుంచి కాల్చి చంపినట్లు సమాచారం. ఆయన ప్రాణాల కోసం వేడుకున్నా ఉగ్రవాదులు వినిపించుకోకుండా ఈ హృదయ విదారక ఘాతుకానికి పాల్పడ్డారు.
చంద్రమౌళి మృతదేహాన్ని అతనితో పాటు ప్రయాణించిన టూరిస్టులు గుర్తించారు. ఈ విషాదకర సమాచారం తెలుసుకున్న వెంటనే విశాఖపట్నం నుంచి ఆయన కుటుంబసభ్యులు పహెల్‌గామ్‌కు బయలుదేరారు. ఈ దాడిలో ఇప్పటివరకు 28 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ఇంకా 20 మందికి పైగా తీవ్ర గాయాలవుతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
Read More : ప్రధాని మోదీ అమిత్ షాకు ఫోన్ చేశారు.

One thought on “పహెల్‌గామ్ ఉగ్రదాడిలో తెలుగు పర్యాటకుడు మృతి..”
Comments are closed.