పర్యాటకులను లక్ష్యంగా ఈ దాడి జరగడంతో కశ్మీర్ పర్యాటక రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఆర్టికల్ 370 రద్దు అనంతరం తిరిగి పుంజుకుంటున్న కాశ్మీర్ పర్యాటక రంగానికి ఇది గట్టి ఎదురుదెబ్బగా మారింది.
పహల్గాం దాడి తర్వాత భద్రతాపై అనేక ప్రశ్నలు తలెత్తడంతో, ఇప్పటికే జూన్ నెల వరకు బుకింగ్‌లున్న టూర్ ప్యాకేజీలు భారీగా రద్దవుతున్నాయని టూర్ ఆపరేటర్లు చెప్పుతున్నారు . “జూన్ వరకు 90 శాతం బుకింగ్‌లు ఫైనల్ అయ్యాయి. కానీ దాడి అనంతరం 80 శాతం బుకింగ్‌లు రద్దయ్యాయి,” అని శ్రీనగర్‌కు చెందిన టూర్ ఆపరేటర్ ఇష్ఫాక్ అహ్మద్ ఆవేదన వ్యక్తం చేశారు.
కశ్మీర్ చేరుకున్న పర్యాటకుల్లోనూ భద్రతపై భయం నెలకొంది. బెంగళూరు నుంచి వచ్చిన పర్యాటక బృందం సభ్యుల్లో ఆరుగురు తమ యాత్రను మధ్యలోనే నిలిపివేసి వెనుదిరిగారు. “ఏళ్ల తరబడి శ్రమించి పర్యాటకులను కాశ్మీర్‌కి తీసుకొచ్చాం. కానీ ఒక్క దాడితో ఆ శ్రమంతా వృథా అయింది,” అని ఒక క్యాబ్ డ్రైవర్ చెప్పుతున్నారు .
హోటల్ యజమానులు, టూర్ ఆపరేటర్లు ఈ పరిస్థితి వల్ల వ్యాపారానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందన్న ఆందోళనలో ఉన్నారు. “ఇంతవరకు శాంతియుతంగా ఉన్న కాశ్మీర్‌లో ఇలాంటి ఘటనలు తిరిగి జరగడం పర్యాటక రంగానికి గట్టి దెబ్బ,” అని హోటల్ యజమాని ముస్తాక్ ఛాయా అన్నారు.
అయితే, ప్రభుత్వం భద్రతను బలోపేతం చేస్తే, రాబోయే అమర్‌నాథ్ యాత్రకు ముందు పరిస్థితి మళ్లీ నార్మల్ అయ్యే అవకాశముందని కొందరు టూర్ ఆపరేటర్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Read More : కేంద్రం అత్యంత గంభీరంగా స్పందించింది

One thought on “కశ్మీర్ పర్యాటక రంగం తీవ్ర సంక్షోభంలోకి”
Comments are closed.