భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌లో మరో కీలక విజయాన్ని సాధించింది. ఇటీవల పాకిస్తాన్‌లోని బహవల్పూర్‌లో జైషే మహ్మద్ ఉగ్రసంస్థ కార్యాలయంపై భారత బలగాలు నిర్వహించిన గగనదాడిలో ప్రధాన ఉగ్రవాది, మసూద్ అజర్ సోదరుడు అబ్దుల్ రవూఫ్ అజర్ తీవ్రంగా గాయపడ్డాడు.
ఈ దాడిలో ఇప్పటికే జైషే చీఫ్ మసూద్ అజర్ కుటుంబానికి చెందిన పదిమంది మృతి చెందినట్టు సమాచారం. బహవల్పూర్‌లోని ఓ రహస్య స్థావరంలో జరిగిన ఈ దాడి తీవ్ర ప్రభావం చూపింది. ఈ దాడిలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అబ్దుల్ రవూఫ్ అజర్ ఇవాళ మృతిచెందాడు.
1999లో ఇండియన్ ఎయిర్‌లైన్స్ IC-814 విమానాన్ని హైజాక్ చేసిన ఘటనలో అబ్దుల్ రవూఫ్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అప్పటినుండి అతడు భారత భద్రతా ఏజెన్సీలకు వాంఛితుడిగా మారాడు. పుల్వామా దాడి సహా పలువురు ఉగ్రవాద చర్యలకు మద్దతుగా నిలిచిన అబ్దుల్ పై దాడిని భారత గగన సైన్యం అత్యంత ఖచ్చితంగా అమలు చేసింది.
ఈ దాడి ఉగ్రవాద సంస్థల పై భారతదేశం చూపిన ఆగ్రహాన్ని సూచిస్తోందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఆపరేషన్ సిందూర్ ద్వారా భారత్ ఉగ్రవాదానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం ఇవ్వదని మరోసారి స్పష్టం చేసింది.
Read More : పాకిస్థాన్ దాడిని సమర్థంగా తిప్పికొట్టిన భారత్.

One thought on “ఆపరేషన్ సిందూర్‌లో జైషే ఉగ్రవాది అబ్దుల్ రవూఫ్ అజర్ హతం..”
Comments are closed.