అంతర్జాతీయ వేదికపై పాక్‌కు మరోసారి అవమానం..

పాకిస్తాన్ రాజకీయ నాయకులు అంతర్జాతీయ వేదికలపై అభాసుపాలవడం కొత్తేం కాదు. తాజాగా పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ కూడా అదే బాటలో నడిచారు. అమెరికాకు చెందిన ప్రముఖ న్యూస్ చానల్ CNN నిర్వహించిన చర్చా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, తగిన ఆధారాలు లేకుండానే చేసిన వ్యాఖ్యలతో తీవ్ర విమర్శలకు గురయ్యారు.

చర్చలో భాగంగా ఆయన మాట్లాడుతూ, “భారతదేశానికి చెందిన ఐదు యుద్ధ విమానాలను మా సైన్యం కూల్చివేసింది” అని సంచలన ప్రకటన చేశారు. వెంటనే యాంకర్ స్పందిస్తూ, “ఈ ఆరోపణలకు మీ వద్ద ఆధారాలు ఉన్నాయా?” అని ప్రశ్నించారు.

ఈ ప్రశ్నకు మంత్రి ఖ్వాజా ఆసిఫ్ బదులిస్తూ, “ఈ సమాచారం మా దేశం నుంచి కాదు. భారత సోషల్ మీడియాలోనే ఈ వార్తలన్నీ వచ్చాయి” అని వ్యాఖ్యానించారు. దీంతో ఆశ్చర్యానికి గురైన యాంకర్, “మీరు ఓ దేశ రక్షణ శాఖ మంత్రిగా ఉన్నారు. సోషల్ మీడియా ఆధారంగా కాకుండా, అధికారిక ఆధారాలతో మాట్లాడాలి కదా?” అంటూ ఆయనపై ఎదురుదాడి చేశారు.

ఈ చర్చా దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పాక్ రక్షణ మంత్రికి ఓ విదేశీ యాంకర్ ఈ స్థాయిలో కౌంటర్ ఇవ్వడం, పాక్ వాదనల్లో ఉన్న అసంపూర్ణతను బహిర్గతం చేసిందని అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సరైన సమాచారం లేకుండా గౌరవమైన వేదికలపై వ్యాఖ్యలు చేయడం వల్ల పాకిస్తాన్ ప్రతిష్ట మళ్లీ దెబ్బతిందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Read More : ఆపరేషన్ సిందూర్‌లో జైషే ఉగ్రవాది అబ్దుల్ రవూఫ్ అజర్ హతం..

One thought on “అంతర్జాతీయ వేదికపై పాక్‌కు మరోసారి అవమానం..

Comments are closed.