మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇరాన్‌లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు భారత ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ సింధు’ విజయవంతంగా కొనసాగుతోంది. ఈ ఆపరేషన్‌లో భాగంగా తొలివిడతగా 110 మంది భారతీయులు ఈరోజు న్యూఢిల్లీకి సురక్షితంగా చేరుకున్నారు. వారిలో 90 మంది జమ్మూ కశ్మీర్‌కు చెందిన విద్యార్థులు ఉన్నట్టు అధికారులు తెలిపారు.
ఇండిగో ప్రత్యేక విమానంలో ఢిల్లీకి రాక
ఇండిగో విమానయాన సంస్థకు చెందిన 6E 9487 ప్రత్యేక విమానంలో ప్రయాణించిన ఈ పౌరులు ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయంలో కేంద్ర విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ స్వయంగా వారికి స్వాగతం పలికారు.
భద్రతే లక్ష్యంగా ‘ఆపరేషన్ సింధు’
ఇరాన్‌లో ఉన్న భారతీయుల భద్రతను దృష్టిలో ఉంచుకుని, వారికి సురక్షిత మార్గాల్లో స్వదేశానికి రప్పించడమే లక్ష్యంగా ఈ ఆపరేషన్‌ను భారత ప్రభుత్వం ప్రారంభించింది. టెహ్రాన్‌లో ఉన్న విద్యార్థులను భారత ఎంబసీ సమన్వయంతో ముందుగా సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
విదేశీ ప్రభుత్వాలకు కృతజ్ఞతలు
ఈ ఆపరేషన్‌కు సహకరించిన ఇరాన్, అర్మేనియా ప్రభుత్వాలకు భారత్ కృతజ్ఞతలు తెలిపింది. శంకతోలుతున్న పరిస్థితుల్లో ఇరాన్‌లో ఉన్న భారతీయ పౌరుల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ భారత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలలో ఇది కీలక దశగా నిలిచింది.
ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్, కంట్రోల్ రూమ్ కార్యాచరణ
ఇరాన్‌లో ఇంకా ఉన్న భారతీయులు టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం ఏర్పాటు చేసిన ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్, అలాగే న్యూఢిల్లీలోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన 24×7 కంట్రోల్ రూమ్‌ను సంప్రదించాలని ఎంఈఏ సూచించింది. అవసరమైన భద్రతా చర్యలు కొనసాగుతాయనీ, మరిన్ని తరలింపులు కూడా త్వరలో జరుగుతాయని ప్రభుత్వం ప్రకటించింది.
Read More : బీమా క్లెయిమ్ దేశ చరిత్రలో రికార్డు స్థాయిలో ఉండే అవకాశం.

One thought on “తొలి విమానం ఢిల్లీకి చేరిన 110 మంది పౌరులు”
Comments are closed.