లెక్కలను సరిచేసుకున్న నిత్యా

నిత్యామీనన్, విజయ్ సేతుపతి ఇద్దరు తమ సహజ నటన తో ఆకట్టుకునేవారే. ఇక వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా అంటే ఒకరిని మించి ఇంకొకరు నటించి వుంటారు అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఇక ఫ్యామిలీ ఎంటరైనర్ తలైవన్ తలైవీతో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కారు విజయ్ సేతుపతి, నిత్యామీనన్. ఈ మూవీకి ముందు ఈ ఇద్దరు ప్లాప్స్ చూశారు. మక్కల్ సెల్వన్ ఏస్ అలా వచ్చి ఇలా వెళ్లిపోయింది. ఇక నిత్యామీనన్ సంక్రాంతి బరిలో సందడి చేసింది. తనకు జాతీయ అవార్డు తెచ్చిపెట్టిన తిరుచిత్రాంబలం తర్వాత దాదాపు 2 సంవత్సరాలు గ్యాప్ తీసుకున్న నిత్యా జయం రవితో కలిసి కాదలిక్క నేరమిల్లేలో నటించింది. కానీ ఆ సినిమా ప్లాప్ గా నిలిచింది.

అప్పుడు మిస్సైన లెక్కలు.. తలైవన్ తలైవీతో సరి చేసుకుంది నిత్యా. జూలై 25న తమిళంలో మాత్రమే రిలీజైన తలైవన్ తలైవీ సూపర్ హిట్ టాక్ తో దూసుకెళుతోంది. ఇప్పటికే తమిళ్ లో రూ.30కోట్ల లను కలెక్ట్ చేసి సూపర్ సక్సెస్ ఫుల్ గా సాగుతోంది. ఆగస్టు 1న తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. భీమ్లా నాయక్ తర్వాత తెలుగులో కనిపించలేదు నిత్యా. డబ్బింగ్ సినిమాలతోనే అప్పుడప్పుడు పలకరిస్తోంది. ఇప్పుడు తలైవన్ తలైవీ సినిమా తెలుగు లో సార్ మేడమ్ పేరుతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇక నెక్ట్స్ బిగ్ టార్గెట్ దసరాకు ఫిక్స్ చేసింది ఈ మలయాళ కుట్టీ. ధనుష్ తో మరోసారి కలిసి బాక్సాఫీసును దోచుకోవాలని గట్టిగానే ట్రై చేస్తోంది. ఇడ్లీ కడాయ్ అనే మరో డ్రామా ఫిల్మ్ తో రాబోతోంది నిత్యా. తాజాగా ఈ సినిమా నుండి రిలీజ్ అయిన ఫస్ట్ లిరికల్ సాంగ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. గత సంవత్సరం ఎనౌన్స్ చేసిన రామ్ కామ్ మూవీ, డియర్ ఎక్సెస్ మూవీ ఆగిపోయిందని నిత్యా క్లారిటీ ఇచ్చింది.

Read More : ఇకనుంచి బెట్టింగ్ యాప్‌లకు ప్రచారం చేయను

One thought on “లెక్కలను సరిచేసుకున్న నిత్యా

Comments are closed.