యూట్యూబర్ సన్నీ యాదవ్‌ను అరెస్ట్?

యూట్యూబ్ ద్వారా తన ప్రత్యేక ప్రయాణాలతో గుర్తింపు పొందిన సన్నీ యాదవ్ తాజాగా ఎన్ఐఏ అధికారుల చేతికి చిక్కారు. ఇటీవల బైక్ పై పాకిస్తాన్ టూర్‌కు వెళ్లిన సన్నీ యాదవ్‌‌ను చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో అరెస్ట్ చేసినట్లు సమాచారం.

ఆయన పాక్ టూర్ గురించి సమగ్ర విచారణ చేపట్టిన నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA), ఆ ప్రయాణ నేపథ్యం, అక్కడ ఎవరు కలిశారు, ఏ ప్రాంతాలు సందర్శించారు వంటి వివరాలపై సన్నీని ప్రశ్నిస్తోంది. సన్నీ యాదవ్ ఇటీవల తన యూట్యూబ్ ఛానల్‌లో పాకిస్తాన్‌లోని అనేక ప్రాంతాల వీడియోలు పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు ఆయన్ని అదుపులోకి తీసుకుని, విదేశీ ప్రయాణం వెనక ఉద్దేశ్యంపై విచారించేందుకు ఎన్ఐఏ అధికారులు మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు. పాక్ పర్యటన అనుమతులపై కూడా విచారణ జరుగుతోందని సమాచారం.

Read More : తాను పట్టించుకోనని తేల్చేసిన సీనియర్ నేత

One thought on “యూట్యూబర్ సన్నీ యాదవ్‌ను అరెస్ట్?

Comments are closed.