బ్రిటన్‌పై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గాజాలో కాల్పుల విరమణకు అంగీకరించకపోతే, పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తిస్తామని బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ చేసిన హెచ్చరికను ఆయన ఖండించారు. హమాస్ ఉగ్రవాదానికి బ్రిటన్ ప్రోత్సాహం ఇస్తోందని, దీంతో హమాస్ బాధితులను శిక్షిస్తున్నట్లే అవుతోందని నెతన్యాహు విమర్శించారు.
పాలస్తీనాను దేశంగా గుర్తించడం భవిష్యత్తులో బ్రిటన్‌కే ముప్పు కలిగించే నిర్ణయమని హెచ్చరించిన నెతన్యాహు, ఉగ్రవాదులను బుజ్జగించే ప్రయత్నాలు ఎప్పటికీ ఫలప్రదం కావని స్పష్టం చేశారు.
గాజాలో కాల్పుల విరమణపై ఒప్పందం కుదరకపోతే, సెప్టెంబరులో జరిగే ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తిస్తామని బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ ఇటీవల హెచ్చరించిన విషయం తెలిసిందే. అలాగే హమాస్ తమ వద్ద బందీలుగా ఉన్న వారిని తక్షణమే విడుదల చేయాలని, నిరాయుధీకరణకు అంగీకరించాలని స్టార్మర్ కోరారు.
ఇక గాజాలో ఇజ్రాయెల్ దాడులపై ప్రపంచవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతున్న తరుణంలో, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ కూడా ఇటీవల పాలస్తీనాను దేశంగా గుర్తిస్తామని ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని ఇజ్రాయెల్‌తో పాటు అమెరికా కూడా తీవ్రంగా ఖండించాయి.
Read More : స్వల్ప లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్

One thought on “బ్రిటన్‌పై విరుచుకుపడ్డ నెతన్యాహు”
Comments are closed.