పదో తరగతిలో – అరుదైన రికార్డు!

ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో అరుదైన రికార్డు నమోదైంది. కాకినాడలోని భాష్యం స్కూల్‌కు చెందిన విద్యార్థిని యల్ల నేహాంజని 600కు 600 మార్కులు సాధించి చరిత్ర సృష్టించింది.

పదో తరగతిలో పూర్తి మార్కులు సాధించడం రాష్ట్రంలో ఇదే తొలిసారని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. నేహాంజని అసాధారణ ప్రతిభను ప్రశంసిస్తూ విద్యా సంస్థలు శుభాకాంక్షలతో ముంచెత్తుతున్నాయి.

ఈ ఘనత యువతలో ప్రేరణనిచ్చేలా ఉందని అధికారులు పేర్కొన్నారు.

Read More : పదో తరగతి : – 81.14% పాస్ , అమ్మాయిలదే పైచేయి..