ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేష్ ఢిల్లీలో జరిగిన ఇండియా టుడే కాంక్లేవ్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇసుక అక్రమ మైనింగ్ ఘోరంగా జరిగిందని, దీనిపై సుప్రీంకోర్టులో కేసు కూడా నడుస్తుందని ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రాష్ట్ర అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా టాటా పవర్‌తో 7 గిగా వాట్స్ ఒప్పందం కుదిరిందని, విశాఖపట్నంలో డేటా సెంటర్ ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు.
మానవ మిత్ర పథకం ద్వారా వాట్సాప్ సేవలను ప్రారంభించామని, ప్రజలు కుల ధ్రువపత్రాలు, హాల్ టికెట్లు, ల్యాండ్ రికార్డులు తదితర పత్రాలను వాట్సాప్ ద్వారా పొందవచ్చని వివరించారు.
తెలుగును రాష్ట్ర భాషగా బలోపేతం చేస్తున్నామని, భాషను బలవంతంగా రుద్దడం తన విధానం కాదని స్పష్టం చేశారు. వివిధ భాషలు నేర్చుకోవడం అవసరమని అన్నారు.
ఎన్డీఏ ప్రభుత్వానికి ఏపీ భేషరతుగా మద్దతు ఇస్తోందని, హెచ్‌ఆర్డీ శాఖను కోరుకుని తీసుకున్నానని లోకేష్ తెలిపారు. కాగా, తన భార్య తన క్రెడిట్ కార్డు బిల్లులు చెల్లిస్తుందని ఆయన సరదాగా వ్యాఖ్యానించారు.
చివరిగా, ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో భారత్ విజయం సాధిస్తుందని లోకేష్ విశ్వాసం వ్యక్తం చేశారు.

One thought on “నారా లోకేష్: వైసీపీ హయాంలో ఇసుక అక్రమ మైనింగ్”
Comments are closed.