“జగన్ ఆంధ్రా సద్దాం హుస్సేన్” – మంత్రి నారా లోకేష్

nara lokesh

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు మంత్రి నారా లోకేష్. రుషికొండలో నిర్మించిన విలాసవంతమైన భవనంపై స్పందించిన ఆయన, జగన్‌ను “ఆంధ్రా సద్దాం హుస్సేన్”గా అభివర్ణించారు.

లోకేష్ మాట్లాడుతూ, “జగన్ తనను తాను ఏపీ సద్దాం హుస్సేన్‌గా ఊహించుకున్నారు. మరో 30 ఏళ్ల పాటు పదవిలో ఉంటానని భావించి, ఆ ఉద్దేశ్యంతోనే రుషికొండలో అతి ఖరీదైన భవనాన్ని నిర్మించారు” అని పేర్కొన్నారు.

విలాసవంతమైన భవనం పై విమర్శలు
లోకేష్ మాట్లాడుతూ, “రుషికొండ ప్రాజెక్ట్ తొలుత ఏపీ ప్రభుత్వ పర్యాటక శాఖకు సంబంధించినది. కానీ ఆ ప్రదేశం చివరికి శిశ్ మహల్‌గా మారింది. మా తాత ఎన్టీఆర్, మా నాన్న చంద్రబాబు ముఖ్యమంత్రులుగా పనిచేశారు. కానీ వారు ఎప్పుడూ ఇంత విలాసవంతమైన భవనాన్ని నిర్మించలేదు” అని విమర్శించారు.

“కేవలం నలుగురు కోసం 700 కోట్ల వ్యయం”
జగన్ కుటుంబం గురించి మాట్లాడుతూ, “వైసీపీ అధ్యక్షుడిది చాలా చిన్న కుటుంబం. ఆయన తన తల్లి, సోదరిలను కుటుంబం నుంచి పంపించి వేశారు. ఇప్పుడు ఆయన, ఆయన భార్య, పిల్లలు మాత్రమే కుటుంబంలో ఉన్నారు. అయినా కేవలం నలుగురి కోసం రూ.700 కోట్ల ఖర్చుతో ఈ భవనాన్ని నిర్మించారు. ప్రధాని మోదీ కూడా ఇంత పెద్ద ఇంట్లో నివాసం ఉండరు” అని లోకేష్ వ్యాఖ్యానించారు.

“భవన వినియోగంపై ఆలోచన”
ఈ భారీ వ్యయాన్ని దృష్టిలో ఉంచుకొని రుషికొండ భవనాన్ని ఎలా ఉపయోగించుకోవాలనే విషయంపై తమ ప్రభుత్వం చర్చిస్తోందని లోకేష్ తెలిపారు.

Read More

One thought on ““జగన్ ఆంధ్రా సద్దాం హుస్సేన్” – మంత్రి నారా లోకేష్

Comments are closed.