వీసా నిరాకరణలతో భారతీయ పర్యాటకులకు భారీగా నష్టం

indian

2024లో వీసా నిరాకరణల కారణంగా భారతీయ పర్యాటకులు సుమారు ₹662 కోట్లు నష్టపోయారు. ముఖ్యంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE), యునైటెడ్ కింగ్‌డమ్ (UK), ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, మరియు షెంజెన్ దేశాలు భారతీయ పర్యాటకుల నుంచి వచ్చిన అనేక వీసా దరఖాస్తులను తిరస్కరించాయి.

వీసా నిరాకరణల పెరుగుదల వెనుక గల ప్రధాన కారణాల్లో కఠినమైన నియమాలు, అధిక వీసా ఫీజులు ముఖ్యంగా ఉన్నాయి. 2024లో వీటికి సంబంధించి మారిన కొత్త నిబంధనల వల్ల అనేక మంది భారతీయ పర్యాటకులు తమ పర్యటన ప్రణాళికల్లో మార్పులు చేసుకోవాల్సి వచ్చింది.

వీసా ఖర్చులు మాత్రమే కాకుండా, పర్యాటకులు గడిపిన సమయం, హోటల్ బుకింగ్‌లు, విమాన టికెట్లు వంటి ఖర్చులు కూడా వృధా కావడం భారతీయ ప్రయాణికులపై ఆర్థికంగా తీవ్ర ప్రభావం చూపింది.

అంతర్జాతీయ పర్యటనలు చేయాలని ఆశించిన భారతీయులు ఇప్పుడు కొత్తగా అమల్లోకి వచ్చిన కఠిన నిబంధనల నేపథ్యంలో మరింత జాగ్రత్తగా తమ పర్యటన ప్రణాళికలు రూపొందించుకోవాలని పర్యాటక నిపుణులు సూచిస్తున్నారు.

One thought on “వీసా నిరాకరణలతో భారతీయ పర్యాటకులకు భారీగా నష్టం

Comments are closed.