ఏపీ మానవ వనరుల అభివృద్ధి, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ ఢిల్లీ పర్యటనకు సిద్ధమయ్యారు. ఈ రోజు రాత్రి ఆయన ఢిల్లీ చేరుకోనుండగా, రేపు ఉదయం (సెప్టెంబర్ 5) ప్రధానమంత్రి నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలవనున్నారు. సమావేశం అనంతరం లోకేశ్ రాష్ట్రానికి తిరిగి వచ్చి, అమరావతిలో జరగనున్న ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో పాల్గొననున్నారు.
జీఎస్టీ సంస్కరణలపై మంత్రి లోకేశ్ స్పందించారు. నాలుగు శ్లాబులను రెండుకు కుదించడం, నిత్యావసరాలపై పన్ను రేట్లు తగ్గించడం వంటి నిర్ణయాలు అభివృద్ధికి తోడ్పడతాయని ఆయన అభినందించారు. దేశ పన్నుల విధానం మరింత సులభతరం అవుతుందని ట్విట్టర్ వేదికగా వ్యాఖ్యానించారు.
అలాగే విద్యార్థుల అవసరాలైన పెన్సిళ్లు, షార్ప్‌నర్‌లు, ఎక్సర్‌సైజ్ బుక్స్, మ్యాపులు, చార్టులపై జీఎస్టీ తగ్గించడం తల్లిదండ్రులకు ఊరటనిస్తుందని అన్నారు. విజ్ఞాన ఆధారిత ఆర్థిక వ్యవస్థకు ఇలాంటి చర్యలు బలమిస్తాయని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు. ప్రధాని మోదీ తీసుకున్న పన్ను సంస్కరణలను ఆయన హర్షించారు.
Read More : శ్రీశైలం ప్రాజెక్టు గేట్లకు లీకేజీలు
2 thoughts on “ఢిల్లీలో ప్రధాని మోదీతో భేటీ కానున్న మంత్రి నారా లోకేశ్.”
Comments are closed.