అత్యాధునిక సౌకర్యాలతో, అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేసిన వీఆర్ హై స్కూల్‌ను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సోమవారం ఘనంగా ప్రారంభించారు. స్కూల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన విద్యార్థులతో మాట్లాడారు, తరగతుల ఏర్పాట్లు, డిజిటల్ విద్యా పద్ధతులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దత్తత తీసుకున్న ఆర్‌ఎస్‌ఆర్ స్కూల్ ఆధునీకరణ పనులకు, అలాగే డీఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ దత్తత తీసుకున్న మూలాపేట బాలికోన్నత పాఠశాల అభివృద్ధి పనులకు శంకుస్థాపన నిర్వహించారు. వీఆర్ స్కూల్ ప్రారంభించిన అనంతరం, మంత్రి లోకేష్ ప్రతీ తరగతిని సందర్శించి విద్యార్థులతో ముఖాముఖి సంభాషణ జరిపారు. చిన్నారులు లోకేష్‌తో సెల్ఫీలు దిగేందుకు ఉత్సాహం చూపించగా, మంత్రి వారితో సన్నివేశాలు పంచుకున్నారు. దాదాపు అర్ధగంట పాటు విద్యార్థులతో ఆత్మీయంగా గడిపారు. అనంతరం స్కూల్ లైబ్రరీను పరిశీలించిన మంత్రి, పీ4 కార్యక్రమంలో పాల్గొన్న పొంగూరు షరణి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, దేవిరెడ్డి సుధాకర్ రెడ్డి, ఎన్సీసీ డైరెక్టర్ రాజులను సత్కరించారు.
క్రీడామైదానాన్ని పరిశీలించిన మంత్రి క్రికెట్, వాలీబాల్ ఆడి విద్యార్థుల్లో ఉత్తేజం నింపారు. ఈ కార్యక్రమానికి మంత్రులు పొంగూరు నారాయణ, పొంగూరు షరణి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కలెక్టర్ ఆనంద్ లు హాజరై మంత్రి లోకేష్‌కు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో విద్యా రంగ అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు మరో అడుగు ముందుకెళ్లినట్లైంది.
Read More : హోంమంత్రి అనిత పర్యటన: ప్రజల సమస్యలపై ఆరా

One thought on “విద్యా రంగ అభివృద్ధిపై మంత్రి లోకేష్ దృష్టి”
Comments are closed.