స్నేహానికి, అనుబంధానికి ఓ గొప్ప ఉదాహరణ: శిరోద్కర్ సిస్టర్స్

Namrata and Shilpa Shirodkar sisters bond

అక్కాచెల్లెళ్ల అనుబంధం అంటేనే ఓ ప్రత్యేకత. తాజాగా నమ్రతా శిరోద్కర్ – శిల్పా శిరోద్కర్ కలిసి ‘ప్రపంచ తోబుట్టువుల దినోత్సవం’ను జరుపుకున్న ఫోటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. త్రోబ్యాక్‌గా షేర్ చేసిన ఈ ఫోటోలో వారు సాంప్రదాయ దుస్తుల్లో ఎంతో అందంగా కనిపిస్తూ అభిమానులను ఆకట్టుకున్నారు.

ఈ ఫోటోలో నమ్రతా గులాబీ-ఆకుపచ్చ రంగుల చీరలో, శిల్పా బంగారు రంగు చీరలో మెరిసిపోతున్నారు. కాస్తా మెట్రో కల్చర్‌లో పెరిగిన వీరిద్దరూ, ఈ తరహా సంప్రదాయ లుక్‌తో కనిపించడం నెటిజన్లను ఆకర్షించింది. ‘‘హ్యాపీ సిబ్లింగ్స్ డే, నాకు ఇష్టమైన వ్యక్తి!’’ అంటూ నమ్రతా క్యాప్షన్ కూడా అందరినీ ఆకట్టుకుంది.

శిల్పా శిరోద్కర్ ఇటీవల బిగ్ బాస్ 18 షోలో పాల్గొన్నారు. షో ముగిసిన తర్వాత, తన చెల్లెలి తిరిగి ఇంటికొచ్చిన సందర్భంగా నమ్రతా ఆమెతో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేస్తూ, తన ఆనందాన్ని వ్యక్తపరిచారు. ఈ సోదరీమణుల మధ్య ఉన్న బంధం అభిమానులకు ముచ్చట అనిపిస్తోంది.

నమ్రతా శిరోద్కర్ 1993లో ఫెమినా మిస్ ఇండియా కిరీటాన్ని గెలుచుకుని, అదే ఏడాది మిస్ యూనివర్స్ పోటీలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించారు. టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్‌బాబును వివాహం చేసుకున్నారు. మరోవైపు శిల్పా శిరోద్కర్ బాలీవుడ్‌లో పలు సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నా, ప్రస్తుతం మాత్రం సినిమాలకు దూరంగా ఉంటున్నారు.

Read More




One thought on “స్నేహానికి, అనుబంధానికి ఓ గొప్ప ఉదాహరణ: శిరోద్కర్ సిస్టర్స్

Comments are closed.