సిలికాన్ వ్యాలీలో భారతీయ ప్రతిభపై మెచ్చిన ప్రముఖ నటుడు కమల్ హాసన్ మరోసారి తన విజ్ఞానపూరిత వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. తాజాగా అమెరికాలోని సాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్న ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ పర్ప్లెక్సిటీ AI ప్రధాన కార్యాలయాన్ని సందర్శించిన కమల్, అక్కడి యువ ఇండియన్ టాలెంట్‌ను ఆకాశానికెత్తారు.
ఈ సందర్భంగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందించిన కమల్ హాసన్, “సినిమా నుంచి సిలికాన్ వరకు సాధన మారినా, భవిష్యత్తుపై మన ఆసక్తి మాత్రం మారదు. పర్ప్లెక్సిటీ AIని చూసిన తర్వాత నాకు ఆ ఊపిరే రీఫ్రెష్ అయ్యింది,” అంటూ పేర్కొన్నారు. ఆ సంస్థను స్థాపించిన అరవ్ శ్రీనివాస్ నేతృత్వంలోని జట్టు, ప్రపంచాన్ని ప్రభావితం చేసే మార్గంలో ఉన్నదని ఆయన ప్రశంసించారు.
పర్ప్లెక్సిటీ AI సంస్థ ప్రస్తుతానికి గూగుల్ తరహాలో వినియోగదారులకు తక్కువ సమయంలో అధిక నాణ్యత గల సమాధానాలు అందిస్తూ, AI రంగంలో విప్లవాత్మక మార్పులకు దారితీస్తోంది. ‘ఒక ప్రశ్న – ఒక మార్పు’ అనే మిషన్‌తో ముందుకెళ్తున్న ఈ సంస్థకు ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ లభిస్తోంది.
కేవలం నటుడిగానే కాకుండా, టెక్నాలజీ, సమాజం, రాజకీయాల వంటి విభిన్న రంగాల్లో సైతం తన అభిప్రాయాలను నిశ్శబ్దంగా వెల్లడిస్తూ వస్తున్న కమల్ హాసన్ ఈసారి భారతీయ యువత ప్రతిభను గ్లోబల్ స్థాయిలో వెలిగించడంలో తనవంతు పాత్ర పోషించారు. ప్రస్తుతం ఆయన మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతున్న తగ్ లైఫ్ సినిమాలో నటిస్తున్నారు.
From cinema to Silicon, the tools evolve—but our thirst for what’s next remains. Inspired by my visit to Perplexity HQ in San Francisco, where Indian ingenuity shines through @AravSrinivas and his brilliant team building the future—one question at a time.
— Kamal Haasan (@ikamalhaasan) April 10, 2025
Curiosity didn’t kill… pic.twitter.com/7Xe1WyIawC

One thought on “పర్ప్లెక్సిటీ AIకి హ్యాట్సాఫ్ తెలిపిన కమల్ హాసన్”
Comments are closed.