తెలంగాణలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పర్యటన

తెలంగాణలో కేంద్ర రోడ్లు, రవాణా శాఖ మంత్రి నితిన్ జైరాం గడ్కరీ ఇవాళ (సోమవారం) పర్యటించనున్నారు. రాష్ట్రంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. సాయంత్రం 5:30 గంటలకు హైదరాబాద్ అంబర్‌పేట ఫ్లైఓవర్‌ను ప్రారంభించనున్నారు. అనంతరం సాయంత్రం 6 గంటలకు జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొని అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు.

అంబర్‌పేట మునిసిపల్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో నితిన్ గడ్కరీ ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అందించిన అభివృద్ధి సహకారం గురించి వివరణ ఇవ్వనున్నారు. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వంపై గడ్కరీ కౌంటర్ ఇవ్వనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

గడ్కరీ పర్యటన సందర్భంగా బీజేపీ రాష్ట్ర నేతలు ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అనంతరం గడ్కరీ ఆదిలాబాద్ జిల్లా కాగజ్‌నగర్ వెళ్లి జాతీయ రహదారి పనులకు శంకుస్థాపన చేస్తారు. ఈ పర్యటనలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎంపీ లక్ష్మణ్‌తో పాటు అనేక మంది బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు పాల్గొననున్నారు.

ఈ పర్యటన బీజేపీకి రాజకీయంగా కీలకంగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Read More : టీఎస్ఆర్టీసీ సమస్యలపై చర్చలకు సిద్ధమైన ప్రభుత్వం