నల్గొండలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు దారుణం

నల్గొండ జిల్లాలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు దారుణానికి దారితీసింది. వివరాల్లోకి వెళితే, నల్గొండ జిల్లా కేంద్రానికి చెందిన రావిళ్ల నరసింహ మద్యం సేవించి ఇంటికి వెళ్తుండగా పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలో చిక్కాడు. అనంతరం నరసింహపై నల్గొండ 1 టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.

దీంతో ఆగ్రహానికి గురైన నరసింహ పోలీస్ స్టేషన్ ముందు ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. ఈ క్రమంలో మంటలను ఆర్పే ప్రయత్నంలో ఒక కానిస్టేబుల్‌కు గాయాలయ్యాయి. నరసింహను వెంటనే ఆసుపత్రికి తరలించగా, ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

Read More : భార్యను వదిలి ట్రాన్స్‌జెండర్‌తో సహజీవనం ?