ముల్తానీ మట్టి vs చందనం: మీ చర్మానికి ఏది బెస్ట్?

ముల్తానీ మట్టి vs చందనం: మీ చర్మానికి ఏది బెస్ట్?

సహజసిద్ధమైన చర్మ సంరక్షణలో ముల్తానీ మట్టి, చందనం ప్రత్యేక స్థానం కలిగి ఉన్నాయి. అయితే, మీ చర్మానికి ఏది ఉత్తమం? ఆయిల్ స్కిన్, పొడి చర్మం ఉన్నవారు ఏదిని ఎంచుకోవాలి? ఏది మెరుగైన ఫలితాలను ఇస్తుంది? దీని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

జిడ్డు చర్మం
✔️ ముల్తానీ మట్టి చర్మంలోని అదనపు నూనెను తొలగించి, మృదువుగా మారుస్తుంది.
✔️ చందనం కూడా నూనె నియంత్రణలో సహాయపడుతుంది.

పొడి చర్మం
✔️ ముల్తానీ మట్టిని పాలు, పెరుగు, తేనెతో కలిపి వాడితే మెరుగైన ఫలితం పొందొచ్చు.
✔️ చందనం చర్మానికి తేమను అందించి, మెరుగు పరుస్తుంది.

ముల్తానీ మట్టి ప్రయోజనాలు
✔️ మొటిమలు, నల్ల మచ్చలను తగ్గిస్తుంది.
✔️ చర్మాన్ని శుభ్రంగా, మృదువుగా ఉంచుతుంది.
✔️ సహజ మెరుపుని అందిస్తుంది.

ముల్తానీ మట్టి, చందనం రెండూ ముఖ చర్మానికి చక్కటి ప్రయోజనాలు అందిస్తాయి. జిడ్డు చర్మం ఉన్నవారు ముల్తానీ మట్టిని, పొడి చర్మం ఉన్నవారు తేమను అందించే చందనాన్ని ఎంచుకోవడం ఉత్తమం. మీ చర్మ తత్వాన్ని బట్టి సరైనదాన్ని ఎంచుకుని, ఆరోగ్యకరమైన, కాంతివంతమైన చర్మాన్ని పొందండి!

Read More