మృణాల్ ఠాకూర్ పిల్లో ఫోటోలు వైరల్

హిందీ బుల్లితెర, వెండి తెరపై ప్రత్యేక గుర్తింపు పొందిన ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్ ఇప్పుడు సౌత్ సినీ ప్రేక్షకుల హృదయాలను కూడా ఆకర్షించడంలో సఫలమవుతోంది. సీతారామం సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మృణాల్‌కి అదృష్టద్వారం తెరచింది. ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ కావడంతో మృణాల్‌కు ఒక్కసారిగా స్టార్‌ ఇమేజ్ వచ్చేసింది. నార్త్‌, సౌత్‌ అనే భేదం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా మారింది.

ఇక సినిమాల్లాగే సోషల్ మీడియాలోనూ మృణాల్‌ బాగా యాక్టివ్‌గా ఉంటోంది. తరచూ తన ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ అభిమానులతో కనెక్ట్ అవుతోంది. తాజాగా ఆమె షేర్ చేసిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. బెడ్‌రూమ్‌లో తీసిన పిల్లో ఫొటోలే దీనికి కారణం. పిల్లోస్‌పై ఉన్న రొమాంటిక్‌ మెసేజ్‌లతో నెటిజన్స్‌ అనేక వ్యాఖ్యలు చేస్తున్నారు. “ఈ రోజు కాదు” అని హార్ట్ షేప్‌ పిల్లోపై రాసి ఉండటంతో ఆర్థం ఏమై ఉండొచ్చో అంటూ చర్చిస్తున్నారు. మరో పిల్లోపై మరింత బోల్డ్ టెక్స్ట్‌ ఉండటంతో విమర్శలు, ప్రశంసలు రెండూ వెల్లువెత్తుతున్నాయి. కొందరు ఆమె బోల్డ్ నెస్‌కి ఫిదా అయితే, మరికొంతమంది విమర్శిస్తున్నారు.

ఇక మౌనీ రాయ్‌తో కలిసి రోడ్డుపై నడుస్తూ, పాటకు స్టెప్పులు వేస్తూ మృణాల్‌ షేర్ చేసిన వీడియో మరింత వైరల్‌ అవుతోంది. ప్రస్తుతం సినిమా షూటింగ్ కోసం స్కాట్లాండ్‌లోని గ్లాస్గోలో ఉన్న మృణాల్‌, అక్కడ మౌనీ రాయ్‌తో గడిపిన సమయాన్ని “వినోదభరితమైన ట్రిప్”గా పేర్కొంది. ‘‘మీరు నేర్పిన విషయాలు నా ప్రదర్శనను మెరుగుపరచడంలో సహాయపడతాయి. మిమ్మల్ని మిస్ అవుతున్నాను’’ అంటూ మౌనీకి ఎమోషనల్ మెసేజ్ పెట్టింది.

ఇటీవల తెలుగులో “హాయ్ నాన్న” సినిమాతో మంచి విజయం సాధించిన మృణాల్ ప్రస్తుతం అడవి శేష్‌తో కలిసి “డెకాయిట్” అనే పాన్‌ ఇండియా సినిమాలో నటిస్తోంది. ఇక తమిళ సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా ఆమెకు ఆఫర్లు వస్తున్నాయని సమాచారం. త్వరలోనే ఆమె తమిళ సినిమాతోనూ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

Read More : కీరవాణి మాటల్లో పవన్ ధర్మాగ్రహం