90’s లో తెలుగు చిత్రపరిశ్రమలో టాప్ హీరోయిన్‌గా వెలుగొంది రంభ. కేవలం 15 ఏళ్ల వయసులోనే కథానాయికగా మారి వెండితెరను ఏలింది. తెలుగు, తమిళం, మలయాళం సహా 8 భాషల్లో 100కి పైగా చిత్రాల్లో నటించి స్టార్ స్టేటస్‌ను సంపాదించింది. కెరీర్ పీక్‌లో ఉన్న సమయంలో పెళ్లి చేసుకుని సినిమాలకు గుడ్‌బై చెప్పిన రంభ.. ఇప్పుడు దాదాపు 14 ఏళ్ల తర్వాత రీఎంట్రీకి రెడీ అవుతోంది.
మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్ వంటి అగ్రహీరోలతో నటించి ఎన్నో హిట్స్ అందుకున్న రంభ, పెళ్లి తర్వాత విదేశాల్లో స్థిరపడింది. అయినప్పటికీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన ఫ్యామిలీ గురించి అభిమానులతో పంచుకుంటోంది. 2010లో కెనడియన్ వ్యాపారవేత్త ఇంద్రకుమార్ పద్మనాభన్‌ను వివాహం చేసుకున్న ఆమె, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్న కుటుంబాన్ని నిర్వహిస్తోంది.
ఇప్పటికే పలు రియాలిటీ షోలలో న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్న రంభ, సినిమాల్లో కూడా మళ్లీ కనిపించేందుకు సిద్ధమవుతోంది. ఈ రీఎంట్రీతో ఆమె ఏ సినిమా ద్వారా ప్రేక్షకులను అలరించబోతుందో అనే ఆసక్తి పెరుగుతోంది. నివేదికల ప్రకారం, రంభకు సుమారు రూ.2 వేల కోట్ల ఆస్తులు ఉన్నట్లు చెబుతున్నారు.

One thought on “14 ఏళ్ల తర్వాత రీఎంట్రీకి సిద్ధమైన స్టార్ హీరోయిన్ రంభ!”
Comments are closed.