సినీ నటులు, విద్యావేత్తలు అయిన మంచు మోహన్‌బాబు మరియు ఆయన కుమారుడు మంచు విష్ణులకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. 2019 ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసులో వారిపై నమోదైన ఎఫ్ఐఆర్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.
వివరాల్లోకి వెళ్తే… 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలంటూ తమ విద్యా సంస్థల తరపున మోహన్‌బాబు, విష్ణు ఆందోళన చేపట్టారు. ఈ ఘటనపై ఎన్నికల కోడ్ ఉల్లంఘన కింద వారిపై కేసు నమోదైంది. ఈ ఎఫ్ఐఆర్‌ను కొట్టివేయాలని మోహన్‌బాబు, విష్ణు ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. అయితే, హైకోర్టు వారి అభ్యర్థనను తిరస్కరించింది.
దీంతో, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ మంచు మోహన్‌బాబు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మోహన్‌బాబు దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు, ఆయనపై నమోదైన ఎఫ్ఐఆర్‌ను క్వాష్ (కొట్టివేస్తున్నట్లు) చేస్తూ తీర్పు వెలువరించింది. సుప్రీంకోర్టు తాజా తీర్పుతో మోహన్‌బాబు, విష్ణులకు ఈ కేసు నుంచి విముక్తి లభించింది.
Read More : జగన్ నెల్లూరు పర్యటనపై హోంమంత్రి అనిత ఆగ్రహం

One thought on “మోహన్‌బాబు, విష్ణులకు సుప్రీంకోర్టులో ఊరట”
Comments are closed.