మహమ్మద్ సిరాజ్ రికార్డు:

భారత ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ అద్భుతమైన ఫిట్‌నెస్‌, నిలకడతో టెస్ట్ క్రికెట్‌లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటున్నాడు. ఇటీవల ముగిసిన ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో సిరాజ్ ఏకంగా 185.3 ఓవర్లు బౌలింగ్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

ఈ గణాంకాలు చూస్తే.. ఇది దాదాపుగా ఒక ఐపీఎల్ సీజన్‌లో ఆడే 46 మ్యాచ్‌లలో వేసే ఓవర్లకు సమానం. టెస్ట్ క్రికెట్ ఆడటానికి ఒక ఫాస్ట్ బౌలర్‌కు ఎంత ఫిట్‌నెస్‌, పట్టుదల అవసరమో సిరాజ్ ప్రదర్శన చూస్తే అర్థమవుతుంది. సుదీర్ఘమైన స్పెల్స్ వేస్తూ, బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టడంలో సిరాజ్ తన నైపుణ్యాన్ని మరోసారి నిరూపించుకున్నాడు.

Read More : భవిష్యత్ సూపర్ స్టార్స్‌గా గుర్తింపు ?